ఏపీలో రేపటి నుండి కేంద్రబడ్జెట్‌పై సమావేశాలు జరగనున్నాయి.26వరకు బడ్జెట్‌పై చర్చలు నిర్వహించనున్నారు. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం , రాజమండ్రి, కాకినాడలో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలు వీటికి హాజరుకానున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.50.65 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీలో 9 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గుంటూరులో జరిగే చర్చకు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరు కానుండగా.. ఫిబ్రవరి 19న తిరుపతిలో జరిగే సమావేశానికి కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ నెల 21న విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ నెల 22న విశాఖలో జరిగే సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరవుతున్నట్లు సమాచారం.
కేంద్రబడ్జెట్ పై ఏపీలో రేపటి నుండి సమావేశాలు: హాజరుకానున్న ఎంపీలు, కేంద్ర మంత్రులు
By admin1 Min Read
Previous Articleచిరు ‘విశ్వంభర’లో మెగా డాటర్ ..?
Next Article ఆషికి-3 తో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల…!