ప్రజలే ఫస్ట్ అనే విధానంతో ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకు అనుగుణంగా అన్ని శాఖల్లో, అన్ని స్థాయిల్లో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తాజాగా ఆయన పర్సెప్షన్ ట్రాకింగ్ సమీక్ష నిర్వహించారు. అలసత్వం, నిర్లక్ష్యం, అవినీతి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా సీఎం అధికారులకు సూచించారు. అనేక కష్టాలు, సవాళ్లను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేస్తున్నామని, వీటి ఫలితాలు రావాలంటే వాటి అమలు అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండాలని సీఎం అన్నారు. మొక్కుబడి పనితీరుతో మార్పు రాదని, గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి పాలనలో స్పష్టమైన వ్యత్యాసం కనిపించేలా మార్పు వచ్చింది అనే అభిప్రాయం వ్యక్తం అయ్యేలా అన్ని వ్యవస్థలు పనిచేయాలని సీఎం సూచించారు. రేషన్ బియ్యం పంపిణీ, దీపం పథకం, ఆర్టీసీ సర్వీసులు, చెత్తనుండి కంపోస్టు తయారీ వంటి కార్యక్రమాలపై ప్రజాస్పందనపై సీఎం సమీక్షించారు.
Previous Articleఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ:ఫేవరెట్ గా బరిలోకి దిగుతోన్న భారత్
Next Article కొత్త ఆదాయ పన్ను బిల్లుపై సెలక్ట్ కమిటీ ఏర్పాటు