చంద్రబాబు బ్రాండ్ తో ఏపీకి పెట్టుబడుదారుల క్యూ కడుతున్నాయని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్‌లో మంత్రి సవిత రెండో రోజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న పలువురు దేశ, విదేశ పెట్టుబడుదారులతో మంత్రి సమావేశమయ్యారు. 5 సంస్థలు…2 వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆయా సంస్థలతో ఒప్పందాలు ఉంటాయని అన్నారు. ఆ పరిశ్రమల స్థాపనతో 15 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. మరిన్ని సంస్థలతో చర్చలు ఫలప్రదంగా ముగిసినట్లు పేర్కొన్నారు. త్వరలో పెట్టుబడిదారుల సదస్సు ఉంటుందని మంత్రి తెలిపారు.భారత్ టెక్స్ అందించిన స్ఫూర్తితో త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోనూ చేనేత పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేలా ఈ సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు