సముద్రాలలో పరిశోధనల కోసం రూపొందించిన సబ్ మెరైన్ “మత్స్య -6000” ప్రయోగం విజయవంతమైంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) ఒక ప్రకటనలో తెలిపింది. సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా ఫోర్త్ జనరేషన్ సబ్ మెరైన్ అభివృద్ధి చేసే బాధ్యతను NIOTకి కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ అప్పగించగా…ఆ సంస్థ దీనిని రూపొందించింది. దీనిలోని సబ్ సిస్టమ్స్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేశారు. ఈ సబ్ మెరైన్ ను జనవరి 27 నుండి ఫిబ్రవరి 12 వరకు చెన్నై సమీపంలోని కాట్టుపల్లి పోర్ట్ లో ఉన్న ఎల్ అండ్ టీ షిప్ బిల్డింగ్ ఫెసిలిటీలో 500 మీటర్ల లోతులో పరీక్షించి విజయవంతమైనట్లు ప్రకటించారు.
Previous Articleఘాటీ మూవీ విడుదలపై క్లారిటీ ఇచ్చినచిత్రబృందం ..!
Next Article ప్రభాస్ ‘ఫౌజీ’ లో యువరాణిగా అలియా భట్ ..?