రన్ వే లతో పనిలేకుండా తక్కువ ప్రదేశంలోనే టేకాఫ్ ల్యాండింగ్ (వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) అయ్యే విధంగా ఉండే ఎయిర్ అంబులెన్స్ లు మన దేశంలో అందుబాటులోకి రానున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ స్టార్టప్ ‘ఈప్లేన్’ వీటిని అభివృద్ధి చేయనుంది. వీటి కొరకు ఈప్లేన్ మరియు ప్రముఖ అంబులెన్స్ సంస్థ ఐసీఏటీటీ మధ్య రూ.8,648 కోట్లు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద 788 ఎయిర్ అంబులెన్స్ లు సరఫరా కానున్నాయి. దేశంలోని ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంచాలని కంపెనీ భావిస్తోంది. వివిధ ప్రదేశాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా మూడు రకాల ప్రోటోటైప్లను ఈప్లేన్ రూపొందిస్తోంది. వీటి రాకతో ఎమర్జెన్సీ వైద్య రవాణాలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశాలున్నాయి.
త్వరలో వర్చువల్ టేకాఫ్ ల్యాండింగ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్ సేవలు..!
By admin1 Min Read