ప్రపంచంలోనే అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ లో ఈరోజు సాయంత్రం నాటికి 55 కోట్ల భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న ఈ మహాత్తర కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంలో ఈ స్థాయిలో జనం పాల్గొనలేదని యూపీ ప్రభుత్వం తెలిపింది. దేశ విదేశాల నుండి కూడా భక్తులు తరలి వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దేశంలోని 110 కోట్ల మంది సనాతనుల్లో దాదాపు సగం మంది పవిత్ర గంగానదిలో స్నానమాచరించారని తెలిపింది. ఎంతో విశిష్టత కలిగిన జనవరి 29న మౌని అమావాస్య రోజు దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్ కు వచ్చారు.
ఈరోజు సాయంత్రం నాటికి ‘మహాకుంభమేళా’లో 55 కోట్ల భక్తులు పుణ్యస్నానాలు
By admin1 Min Read
Previous Articleకక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్ జగన్:మంత్రి లోకేష్
Next Article 90 మీటర్ల త్రో సాకారమవుతుంది: నీరజ్ చోప్రా

