ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన ఒక చర్యపై భారత అభిమానులు మండిపడ్డ సంగతి తెలిసిందే. కరాచీలోని నేషనల్ స్టేడియంపై ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ ఆడుతున్న ఎనిమిది దేశాలలో ఏడు దేశాల జెండాలను ఉంచిన పీసీబీ… భారత జాతీయ పతాకాన్ని మాత్రం ప్రదర్శించకపోవడం పట్ల భారత అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో పాకిస్థాన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఆ స్టేడియం పై భారత పతాకాన్ని ఉంచింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల కరాచీ స్టేడియం తాలూకు వీడియో ఒకటి సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. దాంతో నెటిజన్లు ఇది పాక్ వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, భద్రత సంబంధమైన కారణాలతో తమ జట్టును పాక్ కు పంపించమని బీసీసీఐ తేల్చిచెప్పడంతో ఐసీసీ ఈ టోర్నమెంట్ ను హైబ్రిడ్ పద్దతిలో నిర్వహించనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు