ఐటీ రూల్స్ (2021) లోని కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను ఓటీటీలు, సోషల్ మీడియా వేదికలు తప్పని సరిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. చిన్న పిల్లల్లకు ‘ఏ’ రేటెడ్ కంటెంట్ ను అందుబాటులో ఉంచకుండా చూడాలని ఆదేశించింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నేడు ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. అశ్లీలం, అసభ్యకరమైన కంటెంట్ లపై ఫిర్యాదులు అందాయని ఐటీ రూల్స్ (2021) లోని కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను ఓటీటీలు, సోషల్ మీడియా వేదికలు తప్పని సరిగా పాటించాలని ఈ నిబంధనలు ఉల్లంఘించే ఎటువంటి కంటెంట్ ను ప్రసారం చేయరాదని పేర్కొంది. వయసు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలని ఓటీటీలు నైతిక విలువలు పాటించాలని స్పష్టం చేసింది. ఇక ఇటీవల ‘ఇండియా గాట్ లాటెంట్’ అనే కార్యక్రమంలో రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
ఐటీ రూల్స్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను ఓటీటీలు, సోషల్ మీడియా తప్పని సరిగా పాటించాలి
By admin1 Min Read
Previous Articleహిమాలయాలకు వెళ్లిపోతావా..? పవన్ తో ప్రధాని మోడీ సరదా సంభాషణ
Next Article భారత్ అర్జెంటీనాల మధ్య లిథియం అన్వేషణ పై కీలక ఎంఓయూ