వైసీపీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రతి నెల కూటమి హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని అసెంబ్లీలో అడిగే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి.. 11 సీట్లతో అసెంబ్లీకి వెళ్ళే అవకాశం వైసీపీకి ఉంది కాబట్టి.. వైసీపీని శాసన సభకు వెళ్ళాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే, వైసీపీ అసెంబ్లీకి వెళ్ళాలని కోరితే.. ప్రజల పక్షాన నిలబడాలని అడిగితే.. వ్యక్తిగత అజెండా అంటూ వైసీపీ నేతలు భుజాలు తడుముకోవడం హాస్యాస్పదమని అన్నారు. సమాధానం చెప్పలేక దాటవేయడం వారి అవివేకానికి నిదర్శనమని అసెంబ్లీకి వెళ్ళకపోతే వెంటనే రాజీనామాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ లు పెట్టడానికి కాదని దమ్ముంటే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.
మిర్చి రైతుల కష్టాలపై వైసీపీ కంటే ముందుగానే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ అని రేట్ల హెచ్చుతగ్గులపై రైతు నష్టపోకుండా రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. కేంద్రం నుంచి వెంటనే నిధులు తేవాలని అడిగింది కాంగ్రెస్ పార్టీ. సూపర్ సిక్స్ లో భాగంగా పెట్టుబడి సహాయం రూ.20 వేలు వెంటనే అందించాలని కోరింది కాంగ్రెస్ పార్టీ అని ఆమె పేర్కొన్నారు.
బొత్స గారి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుందని విమర్శించారు. వైసీపీ నేతలు 5 ఏళ్లు ఖాళీగా ఉండి ఎన్నికల ముందు సిద్ధం అంటూ బయటకు వచ్చారు. పని చేయకుండా ఖాళీగా ఉన్నారని తెలిసి ప్రజలు మిమ్మల్ని పనికి రాకుండా చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా బుద్ధి చెప్పారని షర్మిల సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ లు పెట్టడానికి కాదు మీకు ఓట్లు వేసింది:ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫైర్
By admin1 Min Read
Previous Articleఆసియా స్నూకర్ ఛాంపియన్ షిప్ లో 14వ టైటిల్ సాధించిన పంకజ్ అద్వానీ
Next Article హాస్పిటల్ లో చేరిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ