కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్ లో చేరగా… ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఈరోజు సాయంత్రం ఆమెను డిశ్చార్జి చేసే అవకాశం ఉందని హాస్పిటల్ బోర్డు మేనేజ్‌మెంట్ చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. ప్రస్తుతం ఆమె గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమెకు కొన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
Previous Articleఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ లు పెట్టడానికి కాదు మీకు ఓట్లు వేసింది:ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫైర్
Next Article సొంత నియోజకవర్గం రాయ్ బరేలిలో రాహుల్ పర్యటన