న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఆరోగ్య వేదిక 12వ సంచికను ఉద్దేశించి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన జాతీయ ఆరోగ్య మిషన్ ఇతర పథకాల కింద అందించిన సేవల వల్ల రోగులకు ఆరోగ్య చికిత్స నిమిత్తం సొంతంగా ఖర్చు పెట్టే అవసరం తగ్గిందని పేర్కొన్నారు. 2018లో ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన లక్ష్యం అందరికీ ఆరోగ్య చికిత్స సౌకర్యం కల్పించడమేనని తెలిపారు. దేశంలో 40% జనాభాకు ఈ పథకం కింద చికిత్స అందుతుందని ఆయన వివరించారు. ఇటీవల సామాజిక ఆర్థిక హోదాతో సంబంధం లేకుండా 70 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు గల వయోవృద్ధులందరికీ కూడా ఈ పథకాన్ని విస్తరించిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమం కేవలం సమావేశం కంటే ఎక్కువని ఇది భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణను మార్చడానికి ఉద్దేశించిన ఉద్యమమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం సంపూర్ణమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన లక్ష్యం అందరికీ ఆరోగ్య చికిత్స సౌకర్యం
By admin1 Min Read