ప్రపంచంలోనే అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ లో ఇప్పటివరకు పుణ్య స్నానమాచరించిన భక్తుల సంఖ్య 60 కోట్లను దాటిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహాకుంభమేళా యొక్క శక్తిని ప్రపంచం మొత్తం కీర్తిస్తోందని పేర్కొన్నారు. అది గిట్టని కొందరు అపఖ్యాతి పాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈనెల 26న మహాశివరాత్రి నాటికి 60 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరిస్తారని ముందు అనుకున్నా కానీ దానికి ముందే అంచనాలకు మించి భక్తులు హాజరయ్యారని యోగి తెలిపారు. ఇక మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంలో ఈ స్థాయిలో జనం పాల్గొనలేదని ఇటీవలే యూపీ ప్రభుత్వం తెలిపింది. దేశ విదేశాల నుండి కూడా భక్తులు తరలి వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఎంతో విశిష్టత కలిగిన జనవరి 29న మౌని అమావాస్య రోజు దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్రాజ్ కు వచ్చారు.
Previous Articleమారిషన్ జాతీయ దినోత్సవానికి గౌరవ అతిథిగా ప్రధాని మోదీ
Next Article మార్చి 15 నుండి అమరావతి నిర్మాణ పనులు..!