మారిషస్ 57వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వచ్చే నెలలో జరుగనున్నాయి. మార్చి 12న జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ విషయాన్ని మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులామ్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ వేడుకలు సాక్ష్యంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అధినాయకుల్లో మోడీ ఒకరిని ఆయన తన తీరికలేని షెడ్యూల్ లో కూడా తమ ఆహ్వానం అంగీకరించిటంపట్ల గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. గతేడాది మన రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ మారిషస్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మన రాష్ట్రపతికి యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ గౌరవ డాక్టరేట్ ఆఫ్ సివిల్ లా ను ప్రధానం చేసింది. 1968లో మారిషస్ బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది.
మారిషస్ 57వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా భారత ప్రధాని మోడీ
By admin1 Min Read