పంజాబ్ లో ఆసక్తికర ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.ఈ మేరకు పంజాబ్‌లో భగవంత్ మాన్ నేతృత్వంలోని నడుస్తున్న ఆప్ ప్రభుత్వం…ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకరైన కుల్‌దీప్ సింగ్ ధలివాల్ కు రెండు శాఖలు ఎన్ఆర్ఐ వ్యవహారాలు,అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలు అప్పగించింది.గత ఏడాది మరోసారి పునర్వ్యవస్థీకరణ జరిపింది.అవే శాఖలు ఆయనకు కొనసాగించింది.ఈ నేపథ్యంలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ఉనికిలో లేదని గ్రహించి తాజాగా మార్పులు చేసింది.దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ నిన్న విడుదల చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
బీజేపీ విమర్శలు
ఈ అంశంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.పంజాబ్‌లో పాలనను ఆప్ ఒక ‘జోక్’లా మార్చేసిందంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.ఉనికిలో లేని శాఖకు 20 నెలలుగా మంత్రి బాధ్యతలు నిర్వహించడం ఏమిటని నిలదీస్తున్నారు.లేని శాఖను ఒక మంత్రి నిర్వహిస్తున్నారనే విషయం ముఖ్యమంత్రికి తెలియకపోవడం..దీని బట్టి ఆప్ పాలన ఏ విధంగా ఉందొ అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది.