మహారాష్ట్రలో ఒకే రోజు 20లక్షల మందికి ఇళ్ల మంజూరు లేఖలు ఇచ్చారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద 20 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్లు మంజూరు చేసి వారి సొంతిటి కలను సాకారం చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ భేటీలోనే రెండో దశకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. 10 లక్షల మంది లబ్దిదారుల ఎకౌంటులకు మొదటి విడత నిధులు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఏక్ నాధ్ షిండే, అజిత్ పవార్ లతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ఒకప్పుడు పేదల కోసం జన్ ధన్ యోజన ఎకౌంట్లు తెరిస్తే రాహుల్ గాంధీ వారి ఎకౌంటులలో ఏం డిపాజిట్ చేస్తారని అవహేళన చేశారని ఇప్పుడు ఒక్క క్లిక్ తో ఇంతమంది లబ్దిదారులకు మొదటి విడత నగదును బదిలీ చేశామని పేర్కొన్నారు. పీఎంఏవై కింద అత్యధిక ఇళ్లు మహారాష్ట్రకు దక్కినట్లు వివరించారు.
20 లక్షల మందికి…పీఎంఏవై కింద మహారాష్ట్రలో భారీగా ఇళ్ల మంజూరు..!
By admin1 Min Read