మహిళల ఫిడే గ్రాండ్ ప్రి చెస్ టోర్నమెంట్ లో భారత చెస్ స్టార్స్ కోనేరు హంపి ఐదో రౌండ్ లో
చైనాకు చెందిన టాన్ జంగ్ యి తో 69 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. మరో స్టార్ ప్లేయర్
ద్రోణవల్లి హరిక 33 ఎత్తుల్లో రష్యాకు చెందిన అలెగ్జాండ్రా గోర్యాచ్ కినా తో ఆటను ముగించింది. 3 పాయింట్లతో హంపి రెండో స్థానం, హారిక 1.5 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచింది. రష్యా గ్రాండ్ మాస్టర్ కేథరియా లాగ్నో 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఫ్రాన్స్ లో జరిగిన కాపీల్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో హైదరాబాద్ కు చెందిన యువ ఆటగాడు రిత్విక్ కాంస్యం గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో తొమ్మిది రౌండ్ లలో 6విజయాలు, 2 డ్రా లు, ఒక ఓటమితో 7 పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.