సందీప్ కిషన్, రీతువర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’.ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తున్నారు.కాగా ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నారు.ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సందీప్ కిషన్ మాట్లాడుతూ…ఈ సినిమా రెండు గంటలపాటు లాఫ్ రైడ్‌గా ఉంటుందని…థియేటర్లలో నవ్వులు చాలా గట్టిగా వినిపిస్తాయని చెప్పారు.
కాగా నా కెరీర్లోనే ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పనిచేశామని తెలిపారు.ఇందులో రావురమేష్ గారి పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అన్నారు.తాజాగా విడుదలైన ట్రైలర్ విషయానికొస్తే..ఓ తండ్రీకొడుకులు…ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడితే?.. అనే కాన్సెప్ట్‌తో ఈ ట్రైలర్ ఆద్యతం కామెడీగా సాగింది.

