అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యానికి విలువ అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అసెంబ్లీలో మహిళలపై జరిగే అకృత్యాలపై, రైతుల సమస్యలపై మాట్లాడే గొంతు అవసరం లేదా? అధికారమదంతో ప్రతిపక్షం గొంతును తొక్కే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. గవర్నర్‌గారు ప్రతిపక్షం పాత్రను గుర్తించాలని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్రంలో జరిగే అరాచకాలు, అఘాయిత్యాలపై గళమెత్తే ప్రతిపక్షం లేకపోతే విచ్చలవిడిగా దోపిడీ సాగించవచ్చు అనే కుటిలబుద్ధితో ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాదు నిరంకుశ పాలన నడుస్తోందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. దేశచరిత్రలో ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉంటుందా? ఢిల్లీలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మరీ ఏపీలో ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షం ప్రశ్నింస్తుందని భయపడే…వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యానికి విలువ: వైసీపీ నేతలు
By admin1 Min Read