కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో దిగిన ఒక సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందా అనే దానిపై మళ్లీ చర్చ ఊపందుకుంది. భారత్ -యూకే వాణిజ్య చర్చల తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బ్రిటన్ సెక్రటరీ ఆఫ్ ట్రేడ్ జోనాథన్ రేనాల్డ్స్ తో ఉన్న ఫోటోను పంచుకున్నారు. రెండు దేశాల మధ్య చాలా కాలంగా నిలిచిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పునరుద్ధరణ జరిగిందని ఇది స్వాగతించదగిన పరిణామమని పేర్కొన్నారు.
ఇక శశిథరూర్ ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని,కేరళలోని వామపక్ష ప్రభుత్వాన్ని ప్రశంసించారు. దీనితో కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.ఈ నేపథ్యంలో శశిథరూర్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగింది. శశిథరూర్ స్పందిస్తూ…ప్రస్తుతానికి నేను కాంగ్రెస్‌లోనే ఉన్నానని,పార్టీ కనుక నా సేవలను ఉపయోగించకూడదు భావిస్తే…నాకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని తెలిపారు. దేశ,రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని, ప్రతిసారీ పార్టీ ప్రయోజనాల కోసమే మాట్లాడటం తనకు చేతకాదని స్పష్టం చేశారు.నేను ఎప్పడూ సంకుచితంగా ఉండనని ఇదివరకే పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు