తమిళ నటుడు,తమిళ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ ,ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒకే వేదికపై కనిపించారు. విజయ్ గత ఏడాది ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు.అయితే పార్టీ స్థాపించి సంవత్సరం పూర్తైన సందర్భంగా ఈరోజు చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.కాగా ఈ సభకు టీవీకే నేతలతోపాటు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఇద్దరూ స్టేజ్‌పై నిలబడి అభిమానులకు అభివాదం చేశారు.2026లో జరిగే ఎన్నికల బరిలో దిగుతామని పార్టీని ప్రారంభించిన సమయంలోనే విజయ్ ప్రకటించారు.
కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నారని సమాచారం.ఇటీవలే చెన్నైలో విజయ్‌ను ప్రశాంత్ కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన విజయ్‌కి సూచనలు సలహాలు ఇవ్వనున్నట్లు తెలిసింది.ఈ మేరకు ఇతర పార్టీలతో పోత్తులపై, ప్రచార యాత్రలపై విజయ్ కీలక ప్రకటన చేయనున్నట్లు తమిళ మీడియా వెల్లడించింది.అయితే పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మొత్తం 6 అంశాలను ప్రస్తావించారు.#GetOutModi, #GetOutStalin హ్యాష్ ట్యాగ్‌లతో పోస్టర్లను ఏర్పాటు చేశారు.