సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం మైహోం భుజా అపార్ట్మెంట్స్ లో ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణ మురళిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి రాజంపేట కోర్టు పోసానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రి సంబేపల్లి ఎస్సై రాయదుర్గం చేరుకొని పోసానిని అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన్ను ఏపీకి తరలించనున్నట్లు తెలుస్తోంది.
Previous Article‘చావా’ను తెలుగులో తీసుకొస్తున్న గీతా ఆర్ట్స్… మార్చి 7న విడుదల
Next Article ఇంగ్లండ్ పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం..!