ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉండవల్లి పంచాయతీ ఆఫీసు సమీపంలోని ఎంపియుపి స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాను. పట్టభద్రులు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని లోకేష్ కోరారు. ఆయా నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Previous Articleమంగళగిరి చినకాకాని వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ పై మంత్రి లోకేష్ సమీక్ష
Next Article ఐక్యత యొక్క మహాయజ్ఞం పూర్తయింది: ప్రధాని మోడీ