ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ నిన్నటితో ముగిసింది. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరిగిన ఈ మహా కుంభమేళా ఇంత భారీ స్థాయిలో జరగడం చరిత్రలోనే మొదటి సారి. కాగా, ఇంతటి మహత్తరమైన కార్యక్రమం పూర్తైన సందర్భంగా ప్రధాని మోడీ స్పందించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. కుంభ మేళా ముగిసింది… ఐక్యత యొక్క మహాయజ్ఞం పూర్తయింది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఈ గొప్ప ఐక్యత సంగమంలో 140 కోట్ల మంది భారతీయులు 45 రోజులు విశ్వాసంతో కలిసి వచ్చిన విధానం నిజంగా అద్భుతంగా ఉందని కొనియాడారు. కుంభ మేళాలో భక్తులు ఈ స్థాయిలో భాగస్వామ్యం కావడం కేవలం రికార్డు మాత్రమే కాదని ఇది రాబోయే శతాబ్దాలకు మన సంస్కృతి మరియు వారసత్వాన్ని బలోపేతం చేసే మరియు సుసంపన్నం చేసే బలమైన పునాదిని వేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రయాగ్‌రాజ్ లో జరిగిన కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా నిర్వహణ నిపుణులు, ప్రణాళిక నిపుణులు మరియు విధాన వ్యూహకర్తలకు పరిశోధనా అంశంగా మారిందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ కుంభ మేళాలో ఐక్యమయ్యారు. ఈ మరపురాని ఏక భారత్, శ్రేష్ఠ భారత్ గా కోట్లాది మంది భారతీయులకు విశ్వాసం మరియు స్వీయ-సాక్షాత్కారానికి ఒక గొప్ప పండుగగా మారిందని పేర్కొన్నారు . ఈ ఐక్యత మహాకుంభాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యమైన అందరికీ అభినందనలు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు