అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య వైట్ హౌస్ వేదికగా జరిగిన భేటీ వాడీవేడిగా అర్ధాంతరంగా ముగిసింది. మీడియా ఎదుటే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం పట్ల వైట్‌హౌస్ అసహానం వ్యక్తం చేసింది. దీంతో జెలెన్‌స్కీ విసురుగా వెళ్లిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత జెలెన్‌స్కీతో సమావేశమవడం ఇదే మొదటిసారి కాగా , సమావేశానికి ముందు ట్రంప్, జెలెన్‌స్కీ ఒకరికొకరు చేతులు కలుపుకొని, చిరునవ్వుతో కనిపించారు. అయితే, రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని పరిష్కరించేందుకు దౌత్యం అవసరమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పడంతో సమావేశం కాస్త హీట్ పెంచింది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం తదనంతర పరిణామాలపై నేతలు మాట్లాడారు. దీంతో క్రమంగా నేతల మధ్య మాటలు తీవ్రస్థాయికి చేరాయి.
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల భేటీలో వాగ్వాదం
By admin1 Min Read