ఉత్తరాఖండ్ లో మంచుచరియల్ని తొలగించే పనులు చేస్తున్న కార్మికుల్లో 55 మంది ప్రమాదవశాత్తు వాటికింద చిక్కుకుపోయారు. ఒక్కసారిగా పైనుండి మంచుపెళ్లలు వారిపై పడడంతో ఈ ప్రమాదం జరిగింది. సహాయక బృందాలు 32 మందిని కాపాడాయి. మిగిలిన 25 మంది ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో ఛమోలీ జిల్లాలోని మనా గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది . ఇది భారత్-టిబెట్ సరిహద్దులో మన దేశానికి చెందిన చివరి గ్రామం. నేషనల్ హైవే పై భారీగా పేరుకుపోయిన మంచును బోర్డర్ రోడ్స్ సంస్థ (బీఆర్) సిబ్బంది తొలగిస్తున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. మంచుతో కూడిన వర్షం దట్టంగా కురుస్తుండటంతో ఘటనా స్థలికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ చేరుకొని సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి.
ఉత్తరాఖండ్ లో ప్రమాదం…సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ బృందాలు
By admin1 Min Read