ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శనతో ఇంటిముఖం పట్టింది. టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ లలో అన్నింటిలో పరాజయం పాలైంది. మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో, రెండో మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో తాజాగా నేడు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కూడా ఓటమిపాలై కనీసం పాయింట్ల ఖాతా కూడా తెరవకుండానే టోర్నీ నుండి నిష్క్రమించింది. కరాచీ లోని నేషనల్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని 38.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. జో రూట్ 37 (44; 4×4, 1×6), జోఫ్రా ఆర్చర్ 25 (31; 4×4), డకెట్ 24 (21; 4×4) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ 3 వికెట్లు, ముల్డర్ 3 వికెట్లు, కేశవ్ మహారాజ్ 2 వికెట్లు, ఎంగిలి, రబడాలు చెరొక వికెట్ చొప్పున పడగొట్టి ఇంగ్లాండ్ ను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఇక లక్ష్యాన్ని సౌతాఫ్రికా 29.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. వాన్ డర్ డస్సెన్ 72 నాటౌట్ (87; 6×4, 3×6) హెన్రిచ్ క్లాసిన్ 64 (56; 11×4) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. రికెల్టన్ 27 (25; 5×4) పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ విజయంతో సౌతాఫ్రికా సెమీ ఫైనల్ చేరింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, అదిల్ రషీద్ కు ఒక వికెట్ దక్కింది.
సెమీస్ లో సౌతాఫ్రికా… పాయింట్ల ఖాతా కూడా తెరవకుండా నిష్క్రమించిన ఇంగ్లాండ్
By admin1 Min Read