మంత్రాలయం పుణ్యక్షేత్రాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాన్ని అధిష్టించిన పరమ పవిత్ర రోజును పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 404వ పాదుకా పట్టాభిషేక మహోత్సవం గురు వైభవోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. స్వామి వారి ఆశీస్సులు పొందారు. శ్రీ రాఘవేంద్రస్వామి గురువైభవోత్సవాల్లో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలనే పనిచేస్తున్నాం. రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యమని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఆలయంలో నిర్వహించిన రథోత్సవంలో లోకేష్ పాల్గొన్నారు.
రాఘవేంద్రస్వామి గురువైభవోత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది: మంత్రి లోకేష్
By admin1 Min Read