టాలీవుడ్ దర్శకుడు దేవకట్ట వెన్నెల,ప్రస్థానం,ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ లాంటి చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆయన తెరకెక్కించిన చిత్రాలు అటు రాజకీయ కోణంతో పాటు సామజిక సమస్యలను ప్రతిబింబించేలాగా ఉంటాయి.కాగా రిపబ్లిక్ చిత్రం తరువాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు.తాజాగా దేవకట్ట ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై అని తెలుస్తుంది.
అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాలేజ్ టైంలో మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.అయితే ఇద్దరు యూత్ కాంగ్రెస్‌లో కీలక పాత్రలను పోషించారు.ఈ ఇద్దరు కాలేజ్‌లో ఉన్న సమయంలో వాళ్ల స్నేహం ఎలా ఉంది అనే దానిపై వెబ్ సిరీస్‌ను దేవకట్ట తెరకెక్కిస్తున్నాడు అని సమాచారం.అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇందులో చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి నటించబోతున్నట్లు చెబుతున్నారు.అలానే వైఎస్ఆర్ పాత్రలో చైతన్య రావు నటించనున్నాడని సమాచారం. జేడీఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ 70 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారని తెలుస్తుంది.