బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఆమె రాజకీయ వారుసుడిగా భావిస్తున్న మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను మరోసారి అన్ని పార్టీ పదవుల నుండి తొలగించారు.కాగా కాష్ తండ్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్‌ను కొత్త జాతీయ సమన్వయకర్తలుగా నియమించారు.ఈ మేరకు లక్నోలో ఈరోజు జరిగిన బీఎస్పీ సమావేశంలో ఈ మేరకు పార్టీలో భారీ మార్పులు చేశారు.కాగా పార్టీ సంస్థాగత బలాన్ని బలహీనపరిచే వర్గాలను సృష్టించడం ద్వారా పార్టీలో విభజనకు అశోక్ సిద్ధార్థ్ కారణమయ్యారని మాయావతి మండిపడ్డారు.ఈ క్రమంలో పార్టీకి లేదా ఉద్యమానికి హాని కలిగించడానికి తన పేరును దుర్వినియోగం చేస్తే వారిని వెంటనే తొలగిస్తానని ఆమె స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలోనే అశోక్ సిద్ధార్థ్‌ను పార్టీ నుండి బహిష్కరించినట్లు మాయావతి పేర్కొన్నారు.అయితే ఆయన ప్రభావం ఉన్న అల్లుడు ఆకాష్ ఆనంద్‌ను కూడా పార్టీ బాధ్యతలన్నింటి నుండి తొలగించినట్లు వెల్లడించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు