లిథియం వంటి కీలక ఖనిజాలను డిమాండ్ కు తగినట్లుగా దేశీయంగా మరో మూడు నాలుగు సంవత్సరాలలో మనమే ఏర్పరచుకోగల స్థాయికి చేరుకోనున్నట్లు కేంద్ర కోల్, మైనింగ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తాజాగా ఆయన కోల్ కతాలో పర్యటించారు. జి.ఎస్.ఐ (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) 175 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సోలార్ ప్యానెల్స్, మొబైల్ బ్యాటరీలకు లిథియం కీలకమని మరో మూడు నాలుగు సంవత్సరాలలో మనమే మన డిమాండ్ కు తగినట్లుగా దానిని భర్తీ చేసుకునే స్థాయికి చేరతామనే ఆశాభావం వ్యక్తం చేశారు. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM) కోసం రూ.32,000 కోట్లు కేటాయింపులకు అనుమతి లభించిందన్నారు. ఈ మిషన్ కోసం జి.ఎస్.ఐ కీలకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. లాటిన్ అమెరికా లోని అర్జెంటీనాతో కలిసి జి.ఎస్.ఐ ఐదు బ్లాకులలో పనిచేస్తుందని సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా కీలక ఖనిజాల డిమాండ్ పెరుగుతోందని NCMM ఈ ఖనిజాల దిగుమతిపై ఆధారపడే అవసరం లేకుండా ఉండే విధంగా స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోందని తెలిపారు. ఇక జి.ఎస్.ఐ సాధించిన పలు విజయాలను కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.
3-4ఏళ్లలో కీలక మినరల్స్ స్వయం సమృద్ధి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం
By admin1 Min Read
Previous Articleఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే: మంత్రి లోకేష్
Next Article భారత క్రికెట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ అరుదైన ఘనత..!