కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూటమి ఎంపీలు పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, ఏపీకి కావలసిన నిధులపై ఈ సమావేశంలో చర్చించారు. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ లో పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో మూడు కీలక సమావేశాలు జరిగాయి. రాజకీయ పరిణామాల గురించి హోం మంత్రి అమిత్ షాతో చర్చించాం. ఎన్డీయే మున్ముందు ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై చర్చ జరిగింది. అలాగే రాష్ట్రానికి సంబంధించి ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు గురించి చర్చించాం. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లుకు ఆమోదం వచ్చాక నేరాలపై పీడీ కేసులు పెడతామని చంద్రబాబు తెలిపారు. ఇక రాష్ట్రంలో గంజాయి కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయి సాగు ఆపేసిన వారికి ఉపాధితో పాటు ప్రోత్సాహకాలు ఇస్తాం. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు మరో బిల్లు తీసుకువస్తున్నట్లు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు