ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి వివిధ సేవా కార్యక్రమానులను నిర్వహిస్తోన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పడు ఆంద్రప్రదేశ్ నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆపన్నులకు ఎల్లవేళలా అండగా ఉండాలనే ఉద్దేశంతో విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ లో తలసేమియా కేర్ సెంటర్, బ్లడ్ సెంటర్, మరియు పలు సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి. ఈ తలసేమియా కేర్ సెంటర్ ద్వారా, అవసరమైన వారికి సంక్షేమ వైద్యం, రక్తదానం సౌకర్యాలు, మరియు సమాజ సేవా కార్యక్రమాలను సమర్థంగా అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ కృషి చేయనుంది.
విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి
By admin1 Min Read