బాలీవుడ్ పై ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక తాను బాలీవుడ్ ను వీడుతున్నట్లు తెలిపారు. పరిశ్రమ టాక్సిక్ గా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ విషతుల్యంగా మారిపోయిందని, బాక్సాఫీసు వద్ద అంకెలకే ప్రాధాన్యం తప్ప సృజనాత్మక స్వేచ్ఛకు స్థానం లేకుండా మార్చేశారని అనురాగ్ కశ్యప్ తీవ్ర విమర్శలు చేశారు. అందుకే బాలీవుడ్ ను వదిలేస్తున్నానని సంచలన ప్రకటన చేశారు. సృజనాత్మకతకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని, ప్రతీ ఒక్కరూ 500 కోట్లు, 800 కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా సినిమాలు రూపొందించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బాక్సాఫీసు వద్ద రాబట్టిన వసూళ్ల ఆధారంగా సినిమాను నిర్ణయించేస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముంబైకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నట్లు ఇదివరకే తెలిపిన ఆయన తాజాగా బెంగుళూరుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు