భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ‘వివిధతా కా అమృత్ మహోత్సవ్’ రెండవ ఎడిషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం 6 నుండి 9 వరకు మూడు రోజులపాటు రాష్ట్రపతి భవన్ వేదికగా జరగనుంది. దక్షిణ భారతదేశానికి చెందిన పలు రకాల హస్తకళలు, సంస్కృతులు గురించి ప్రజలు అవగాహన చేసుకునేందుకు తోడ్పడుతుంది. కళాకారులు, చేనేతకారులు ఈ మహోత్సవంలో భాగమయ్యారు. ఈ మహోత్సవాన్ని దేశ అత్యద్భుతమైన వైవిధ్యతను చాటి చెప్పేందుకు వేడుకగా నిర్వహిస్తున్నారు. ఏడు ఎడిషన్ లుగా రూపొందించి, నిర్వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ, ఉత్తర, తూర్పు, పశ్చిమ, మధ్య భారతదేశం మరియు కేంద్రపాలిత ప్రాంతాల హస్తకళలు, సంస్కృతిని ఈ వేదికగా ప్రదర్శించనున్నారు. ఇది రెండో ఎడిషన్ కాగా, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, సిక్కింకు చెందిన హస్తకళలు, సంస్కృతుల పై దృష్టి సారిస్తూ ‘వివిధతా కా అమృత్ మహోత్సవ్’ మొదటి ఎడిషన్ 2024, ఫిబ్రవరి 8 నుండి11 వరకు మూడు రోజులపాటు జరిగింది.
‘వివిధతా కా అమృత్ మహోత్సవ్’ రెండవ ఎడిషన్ ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ
By admin1 Min Read
Previous Articleఈరోజు కూడా లాభాలే..!
Next Article భారత ఫుట్ బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి పునరాగమనం..!