భారత్ అమెరికాల మధ్య నెలకొన్న సుంకాల అంశానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. అమెరికా సుంకాలు పెంపుతో మనపై నష్ట ప్రభావం లేకుండా చేసే అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అమెరికా ప్రతినిధులతో మాట్లాడేందుకు మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. వారితో చేసే చర్చలు ఫలవంతంగా ఉంటాయనే ఆశా భావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం లో కేంద్ర బడ్జెట్ పై ఆమె వివిధ రంగాల ప్రతినిధులతో సమావేశమై సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా MSME సంస్థల కోసం ‘న్యూ క్రెడిట్ అసెస్మెంట్ మోడల్ ‘ ను ప్రారంభించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మరియు ఇతర అధికారులతో కలిసి మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలుగా కేంద్రం సహాకారం అందిస్తుందని తెలిపారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ నిధుల అంశాలను ప్రస్తావించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు