భారత దేశంలోని పులుల జనాభాను సంరక్షించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం టైగర్ రిజర్వ్ లను నిర్వహిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో చంబల్ ప్రాంతంలోని శివపురి జిల్లాలో ఉన్న మాధవ్ నేషనల్ పార్క్ ను మధ్యప్రదేశ్ లో 9వ టైగర్ రిజర్వ్, దేశంలో 58 వ టైగర్ రిజర్వ్ గా తాజాగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వింధ్య పర్వతాలల్లో దాదాపు 355 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నేషనల్ పార్క్ విస్తరించి ఉంది. 1958 సంవత్సరంలో నేషనల్ పార్క్ గా ప్రకటించారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ లో వీరాంగన దుర్గావతి, కన్హా, సత్పురా, బాంధవఘర్, పెంచ్, సంజయ్ దుబ్రి, పన్నా, రతపాని టైగర్ రిజర్వ్(2024)లు ఉన్నాయి. తాజాగా ఈ ఏడాది మాధవ్ నేషనల్ పార్క్(2025) టైగర్ రిజర్వ్ గా గుర్తించారు. ఈ గుర్తింపుతో ఈ టైగర్ రిజర్వ్ లో పులులను సంరక్షించేందుకు ఎన్టీసీఏ నుంచి నిధులు కూడా లభిస్తాయి. ప్రపంచంలోని మొత్తం పులుల జనాభాలో 70% పైగా భారతదేశంలోనే ఉంది. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 గణాంకాల ప్రకారం, దేశంలో దాదాపు 3,167 పైగా పులులు ఉన్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు