ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే రాజధానికి రుణాలు సమకూర్చే వ్యవహారంలో సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. అమరావతి నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ)ల నుండి తీసుకునే రుణాలు ఏపీ అప్పుల పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇక అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈనెల లోనే అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సీఆర్డీఏ, ఏడీసీ ఇప్పటివరకు 62 పనులకు టెండర్లు పిలిచినట్లు తెలుస్తోంది. రూ.40 వేల కోట్ల విలువైన పనులకు కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.
అమరావతి నిర్మాణానికి రుణాలు… రాష్ట్ర అప్పుల పరిధిలోకి రావు:కేంద్ర ఆర్థిక శాఖ
By admin1 Min Read