ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాజధాని నేడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు ఈసందర్భంగా ఆయన సమాధానమిచ్చారు. మరో మూడేళ్లలో అమరావతి నిర్మాణం 2028 నాటికి పూర్తవుతుందని స్పష్టం చేశారు. రాజధానికీ రూ.64,721 కోట్ల ఖర్చవుతుందని తెలిపారు. నాడు సీఎం చంద్రబాబుపై నమ్మకంతో అమరావతి రైతులు భూములు ఇచ్చిన విషయం గుర్తు చేశారు. రైతులు 58 రోజుల వ్యవధిలోనే 34 వేల ఎకరాలు ఇచ్చారని రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడేళ్లలో రైతులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. టాప్-5 రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారని తెలిపారు. మూడేళ్లలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణాలు పూర్తవుతాయని, ఏడాదిన్నరలో అధికారుల భవనాలు పూర్తి చేస్తామని తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

