ప్రఖ్యాత సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ (ట్విట్టర్) సేవల్లో 9వ తేదీన కొద్దీ సేపు పాటు అంతరాయం కలిగింది.ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ వినియోగదారులు ఇబ్బందిని ఎదుర్కొన్నారు.సోమవారం ఒక్కరోజే మూడుసార్లు సేవలు నిలిచిపోయాయి.అమెరికా,ఇండియా, యూకే,ఆస్ట్రేలియా,కెనడా వంటి ప్రధాన దేశాల్లో ఎక్స్ సేవలకు అంతరాయం కలిగినట్లు 40,000 మంది ఫిర్యాదు చేశారు.ఈ అంశంపై తాజాగా ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందిస్తూ ఎక్స్ సేవల్లో అంతరాయానికి కారణం సైబర్ దాడేనని తెలిపారు.భారీ స్థాయిలో సైబర్ దాడి జరిగిందని,దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నామని పేర్కొన్నారు.అయితే సైబర్ దాడికి పాల్పడిన దుండగుల ఐపీ అడ్రస్ లు ఉక్రెయిన్ ప్రాంతానికి చెందినవేనని తెలిపారు.ఈ విషయంపై ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘ఎక్స్ పై సైబర్ దాడి జరిగింది.దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉండొచ్చు. ప్రస్తుతానికి దీనిపై కచ్చితంగా చెప్పలేను కానీ ఐపీ అడ్రస్ లు మాత్రం ఉక్రెయిన్ ప్రాంతానికి చెందినవేనని గుర్తించాం’ అని మస్క్ చెప్పారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు