భారత్‌లోని 9 యూనివర్సిటీలు మరియు విద్యాసంస్థలు ‘క్యూఎస్’ ప్రపంచ టాప్-50 జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. మినరల్, మైనింగ్ ఇంజనీరింగ్‌లో ధన్‌బాద్ ఐఎస్‌ఎం 20వ ర్యాంక్ సాధించగా, ముంబై, ఖరగ్‌పూర్ ఐఐటీలు వరుసగా 28, 45 స్థానాల్లో నిలిచాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో ఢిల్లీ, ముంబై ఐఐటీలు టాప్-50లో స్థానం సంపాదించాయి. ఐఐటీ మద్రాస్ (పెట్రోలియం ఇంజనీరింగ్), జేఎన్‌యూ (డెవలప్‌మెంట్ స్టడీస్) కూడా టాప్-50లో చోటు దక్కించుకున్నాయి. దంత వైద్య శాస్త్రంలో సవిత మెడికల్, టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ (తమిళనాడు) టాప్-50లో నిలిచింది. హెచ్‌సీయూ ఏడు సబ్జెక్టుల్లో మంచి ర్యాంకులు సాధించింది. ఆంగ్ల భాష-సాహిత్యంలో 251-300, లింగ్విస్టిక్స్ 301-350, సోషియాలజీ 301-375, కెమిస్ట్రీ 451-500, ఎకనామిక్స్-ఎకనామెట్రిక్స్ 501-550, ఫిజిక్స్-ఖగోళశాస్త్రం 601-675, బయోలాజికల్ సైన్సెస్‌లో 651-700 బ్యాండ్ ర్యాంకింగ్ పొందింది.
Previous Articleమీ స్వీయక్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది… హెడ్మాస్టర్ కు మంత్రి లోకేష్ అభినందనలు
Next Article గాయంతో బాధపడుతున్న రాహుల్ ద్రవిడ్…!

