విద్యుత్ రంగంలో 1998లో తొలిసారి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆ రోజు ప్రపంచబ్యాంకు జీతగాడు అని విమర్శించారు. మీటర్ రీడింగ్ కోసం స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్ మిషన్ కమిటీగా విభజించినట్లు తెలిపారు. ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం. కరెంట్ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారుచేశాం. వ్యవసాయ కరెంటుకు యూనిట్‌కు వసూలు చేసే పరిస్థితి నుంచి శ్లాబ్ రేటుతో రైతులను ఆదుకుంది టీడీపీనేని స్పష్టం చేశారు. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల కరెంటు ఇస్తామని పేర్కొన్నారు. వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఓ వ్యక్తి ఇగో వల్ల రూ.9 వేల కోట్లు ప్రభుత్వం కట్టాల్సి వచ్చిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ఎలా నాశనం చేసిందో ఇది ఒక ఉదాహరణ అని ఆలోచన లేకుండా పీపీఏలను రద్దు చేసి అంతర్జాతీయంగా రాష్ట్ర పరువు తీసారని దుయ్యబట్టారు.
16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి, రామాయణ రచయిత, కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
విద్యుత్ రంగంలో 1998లో తొలిసారి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనే: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read