భారత్,మారిషస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచేందుకు 8 కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందాలు జరిగాయి.ఈ సందర్భంగా మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులమ్‌తో కలిసి ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.అయితే మారిషస్ ప్రభుత్వం ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’ను ప్రదానం చేసింది, ఇది ఆయనకు వచ్చిన 21వ అంతర్జాతీయ అవార్డు.ఈ మేరకు వాణిజ్యం, సముద్ర భద్రత, ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి, క్రాస్‌బోర్డర్ లావాదేవీలలో జాతీయ కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి అంశాల్లో ఇరుదేశాలు పరస్పర సహకారం అందించుకోవడానికి అంగీకరించాయి.అదనంగా,సముద్ర డేటా పంచుకోవడం,మనీలాండరింగ్‌ను అరికట్టడానికి ఉమ్మడిగా కృషి చేయాలని నిర్ణయించాయి.ఈ ఒప్పందాలు రెండు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.
On the special occasion of Mauritius’ National Day, I had the opportunity to meet my good friend, PM Navinchandra Ramgoolam and discuss the full range of India-Mauritius friendship. We have decided to raise our partnership to an Enhanced Strategic Partnership.
We talked about… pic.twitter.com/DvNDUy7ML4
— Narendra Modi (@narendramodi) March 12, 2025