పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలని ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల్లో చైతన్యం కోసం మంగళగిరి నియోజకవర్గంలో డోర్ టూ డోర్ ప్రచారం చేపట్టారు. స్వచ్ఛతలో మంగళగిరిని ఆదర్శ కార్పోరేషన్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మంగళగిరి లోని ఎకో పార్క్ లో స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ పార్క్ లో చెత్తను శుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికుడితో ముఖాముఖి మాట్లాడారు. వారిని ఘనంగా సత్కరించారు. మంగళగిరి పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.
మంగళగిరి ఎకో పార్క్ లో “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్
By admin1 Min Read

