రాజధాని అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్వహించిన శ్రీనివాస కళ్యాణోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ వేడుకలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగిన శ్రీవారి కళ్యాణంతో రాజధాని ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందని పేర్కొన్నారు. ఆ ఏడుకొండల వాడి దయతో అమరావతి… ప్రజలు గర్వించే రాజధానిగా ఆవిష్కృతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు మంచి జరిగేలా…. స్వర్ణాంధ్ర లక్ష్యం సాధనకు మేం చేస్తున్న కృషి ఫలించేలా శ్రీనివాసుడు కరుణించాలని ప్రార్థించినట్లు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
శ్రీవారి కళ్యాణంతో రాజధాని ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read