వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై కోటరీ కారణంగా ఆయనకు తీవ్ర నష్టం జరుగుతోందని కోటరీ నుండి బయటకు రాకపోతే జగన్ కు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి! ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు! ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే! అంటూ ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి: విజయసాయిరెడ్డి ఆసక్తికర పోస్ట్
By admin1 Min Read
Previous Articleఅస్వస్థతకు గురైన ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్
Next Article తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…!