యంగ్ హీరో నితిన్ ఇప్పుడు మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆయన నుండి కొన్నాళ్లుగా ఒక్క హిట్ కూడా రాలేదు.ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు.ఈ చిత్రం యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రంగా తెరకెక్కించారు.దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఇందులో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి సంగీతం అందించాడు.ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయాలని అనుకుంటున్నారు.
నితిన్ అప్పట్లో వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ చిత్రంలో నటించాడు.ఈ సినిమాకి సంబంధించిన అన్నీ పనులు పూర్తయ్యాయి.ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నారు.కెరీర్‌లో పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌తో ఉన్నారు.అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నితిన్‌కి ఆసక్తికర ప్రశ్నలు ఎదురుయ్యాయి.పలువురు టాలీవుడ్ హీరోల ఫొటోలని చూపిస్తూ..వారి నుండి ఏ విషయం దొంగిలించాలని అనుకుంటున్నారని నితిన్‌ని ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
నాని నుండి ఈగ చిత్రాన్ని తస్కరించాలని అనుకుంటున్నాను.స్క్రిప్ట్ సెలక్షన్ బాగుంటుంది, కాబట్టి దానిని దొంగిలించాలని అనుకుంటున్నాను. ఎన్టీఆర్ నుండి డైలాగ్ డెలివరీ, మహేష్ బాబు నుండి అందం, స్వాగ్, పవన్ కళ్యాణ్ నుండి అన్ని విషయాలు,ప్రభాస్ నుండి ఆయన వ్యక్తిత్వం రాజసం, విజయ్ దేవరకొండ రౌడీ క్యారెక్టర్ తస్కరించాలని అనుకుంటున్నానని నితిన్ చెప్పాడు.కాగా శ్రీలీలను ఇవే ప్రశ్న అడగా, కాజల్ నుండి కళ్లు, అనుష్క నుండి హైట్, వ్యక్తిత్వం అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది.