పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థులందరికీ ఏపీ సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న యువ స్నేహితులందరికీ శుభాకాంక్షలు! ఈ పరీక్షలు మీ విద్యా ప్రయాణంలో కీలకమైన మైలురాయి. దృష్టి కేంద్రీకరించండి, కష్టపడి పనిచేయండి మరియు మీ సమయాన్ని తెలివిగా వినియోగించుకోండి. మీపై నమ్మకం ఉంచుకోండి, విజయం మీ వెంటే ఉంటుంది.
ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్:
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు. అందరూ చక్కగా పరీక్షలు రాయాలని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోండి. ఎటువంటి ఒత్తిడికి గురికావద్దు. ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే పరీక్ష సమయం ఇది. ప్రశాంతంగా ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పరీక్ష పూర్తి చేయండి. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీరు, సౌకర్యాలు ఏర్పాటు చేసాం. విజయీభవ.
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు
By admin1 Min Read