బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు నేర న్యాయ చట్టాలు ఈశాన్య రాష్ట్రాలలో అమలు తీరు గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాల అమలుపై ఈశాన్య రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల హోం మంత్రులతో ప్రెజెంటేషన్ ఇచ్చాయి. ఈసందర్భంగా అస్సాం ఈ కొత్త న్యాయం చట్టాల గురించి ప్రచురించిన పుస్తకాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన ఉన్న నేపథ్యంలో రాష్ట్రం నుండి గవర్నర్ హాజరయ్యారు. మిగిలిన 7 రాష్ట్రాల నుండి సీఎంలు, డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు, కేంద్రం నుండి పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈశాన్య రాష్ట్రాలలో కొత్త న్యాయ చట్టాల అమలు గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష
By admin1 Min Read
Previous Articleపార్లమెంటు, అసెంబ్లీలలో అరకు కాఫీ స్టాల్స్
Next Article పవర్ ఫుల్ గా ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ‘ టీజర్