పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించిన నేపధ్యంలో నేటి నుండి రెండు చోట్ల తాత్కాలిక స్టాల్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గిరిజన సహకార సంస్థ అధికారులు తెలిపారు. ఏపీ అసెంబ్లీ లో కూడా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులు పండించే అరకు కాఫీని మరింత ప్రోత్సహించే దిశగా ఏపీ కూటమి ఎంపీలు ఇటీవల లోక్ సభ స్పీకర్ ను కలిశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ లు కలిసి అరకు కాఫీ ప్రచారం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మరియు అరకు కాఫీ కోసం శాశ్వతంగా ఒక స్టాల్ ఏర్పాటు చేయమని కోరారు. తోటి పార్లమెంట్ సభ్యులు మరియు ప్రముఖులకు ఈ కాఫీ రుచిని మరింత దగ్గర చేసే విధంగా తీసుకురావాలనే భాగంగా ఈ ప్రయత్నం చేసినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు