చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్రం తాజాగా ఆమోదం తెలిపినట్టు ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ ప్రకటించారు.బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చంద్రయాన్-3 ద్వారా 25 కేజీల బరువున్న ప్రజ్ఞాన్ రోవర్‌ను చంద్రుడిపైకి పంపినట్లు గుర్తు చేశారు. కానీ చంద్రయాన్-5 ద్వారా 250 కేజీల బరువున్న రోవర్‌ను చంద్రుడిపైకి పంపనున్నట్లు తెలిపారు. 2008లో చంద్రయాన్-1, 2019లో చంద్రయాన్-2 మిషన్ల ద్వారా చంద్రుడిపై ఖనిజాలు, రసాయనిక పరిమాణాలు, భూగర్భ పరిస్థితులను అధ్యయనం చేసినట్లు చెప్పారు. చంద్రయాన్-2 ద్వారా పంపిన హై-రిజల్యూషన్ కెమెరా ఇప్పటికీ వందల సంఖ్యలో ఇమేజ్‌లను పంపిస్తోందని పేర్కొన్నారు. చంద్రయాన్-3 ద్వారా సేఫ్ ల్యాండింగ్, రోవర్ మూమెంట్ వంటి పరిక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పుడు చంద్రయాన్-5 మరింత అధునాతనంగా ఉండబోతోందని వెల్లడించారు.
చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్:-ఇస్రో చైర్మన్ వీ నారాయణన్
By admin1 Min Read